Hyd | న‌గ‌రంలో ప‌లు చోట్ల వ‌ర్షం..

హైద‌రాబ‌ద్ : న‌గ‌రంలోని ప‌లు చోట్ల‌ ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. అబిడ్స్, కోఠి, బషీర్ బాగ్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎమ్మెల్యే కాలనీ, కృష్ణానగర్ ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. కాగా, ఈ రోజు నుంచి మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *