ప్రజావాణి కార్యక్రమంలో అందిన ఫిర్యాదులు మేరకు.. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను క్షేత్ర స్థాయిలో HYDRAA కమిషనర్ AV రంగనాథ్ పరిశీలించారు.
ఈ సందర్భంగా అల్వాల్ మండలం తిరుమలగిరి విలేజ్ లోతుకుంటలో ప్రభుత్వ భూమి కబ్జాను హైడ్రా కమిషనర్ పరిశీలించారు. కంటోన్మెంట్ ప్రాంతంలోని ఈ భూమి… జనరల్ ల్యాండ్ రికార్డ్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి చెందినదిగా నమోదు కాగా.. ప్రైవేట్ వ్యక్తులు దానిని తమదిగా పేర్కొంటున్నారు. దీంతో వంద ఎకరాలకు పైగా ఉన్న ఈ భూమిలో ఎటువంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వవద్దని కమిషనర్ అధికారులకు ఆదేశించారు.
అనంతరం గండిమైసమ్మ మండలం దుండిగల్ గ్రామంలోని బుబ్బఖాన్ చెరువు దిగువున వున్న లింగం చెరువు కాలువ పరిసరాలను కమిషనర్ పరిశీలించారు. బుబ్బఖాన్ చెరువు అలుగు, తూముల నుంచి వరద నీరు వెళ్లకుండా నాలను కబ్జాచేసి నిర్మాణాలు జరిగాయని.. దీంతో వరద ముంచెత్తుతోంది స్థానికులు కమిషనర్ కి ఫిర్యాదు చేసారు.
ఈ సమస్యను పరిష్కరించాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో…. అక్కడి నివాసితులు, రియల్ ఎస్టేట్ కంపెనీలు ఒక కట్టుబడి నిర్ణయానికి రావాలని కమిషనర్ సూచించారు. అనంతరం హఫీజ్‌పేట సమీపంలోని ప్రభుత్వ భూమి ఆక్రమణను పరిశీలించారు. టీడీఆర్ కింద లబ్ధి పొంది.. ప్రభుత్వ భూమిని ఆక్రమించారా అనే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.