హైదరాబాద్ : నగరంలో ఏప్రిల్ 10వ తేది నాడు అన్నీ మటన్, చికెన్ షాపులు మూసివేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. జైన మతంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటైన మహావీర్ జయంతిని పురస్కరించుకుని, బుధవారం, ఏప్రిల్ 10న నగరంలోని అన్ని నాన్ వెజ్ షాపులు మూసివేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ప్రకటించింది.
ఆ రోజున చికెన్, మటన్, బీఫ్, చేపలు, ఇతర మాంసం ఉత్పత్తులను విక్రయించే అన్ని దుకాణాలను మూసివేయాలని GHMC కమిషనర్ రోనాల్డ్ రోజ్ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. జైన సమాజం మతపరమైన భావాలను, వారి “అహింస” సూత్రాన్ని గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.