HYD | టీచర్స్, పేరెంట్స్ కు జంపన ప్రతాప్ రిక్వెస్ట్..

ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు క్రీడలలో పాల్గొనేలా ప్రోత్సహించాలని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను కోరారు.
న్యూ బోయినపల్లి ప్లే గ్రౌండ్‌లో జరిగిన రెండు రోజుల గౌతమ్ మోడల్ స్కూల్ స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమానికి జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ.. ఆక్రమణకు గురైన భూమిని కాపాడి తన సొంత నిధులతో క్రీడా మైదానంగా అభివృద్ధి చేశానని, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఈ మైదానాన్ని క్రీడలకు ఉపయోగించుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా ఒలింపిక్ జ్యోతితో విద్యార్థుల కవాతు నిర్వహించి గౌరవ వందనం స్వీకరించారు. స్పోర్ట్స్ మీట్లో భాగంగా, కబడ్డీ, కోకో, బ్యాడ్మింటన్, రన్నింగ్ వంటి వివిధ క్రీడలలో పాల్గొని విజేతలుగా నిలిచిన విద్యార్థులకు జంపన ప్రతాప్ చేతుల మీదుగా ఓవరాల్ ఛాంపియన్‌షిప్, జ్ఞాపికలను అందజేశారు.
ఈ కార్యక్రమం లో స్కూల్ డీన్ సంతోష్, ప్రిన్సిపాల్ అనుపమ, ఐసీ ఇంచార్జ్ రవీందర్, హై స్కూల్ ఇంచార్జ్ రహమత్, విశాలక్ష్మి, పింకీ విద్యార్థులు పాల్గొన్నారు.
