హైదరాబాద్ : నగరంలోని కోకాపేటలో ఈరోజు (శనివారం) సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. జి.ఎ.ఆర్. టవర్స్ రెస్టారెంట్‌లో గ్యాస్ సిలిండర్ పేలి… ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రెస్టారెంట్‌లోని పలువురు ఉద్యోగులు గాయపడ్డారు. దీంతో క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే, మంటలు చెలరేగిన రెస్టారెంట్ భవనంలో పలు ఐటీ కంపెనీలు కూడా ఉన్నాయి.
ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.