హైదరాబాద్ నగరంలో మళ్లీ భారీ వర్షం కురిసింది. కూకట్పల్లి, కేపీహెచ్బీ, ప్రగతినగర్, బాచుపల్లి, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం, మల్కాజిగిరి, కుషాయిగూడ, ఈసీఐఎల్, నాగారం, దమ్మాయిగూడ, కీసర, చర్లపల్లి, ఉప్పల్, చిలుకానగర్, పీర్జాదిగూడ, మేడిపల్లి, బోడుప్పల్ వంటి పలు ప్రాంతాలు వర్షానికి తడిసిపోయాయి.
వర్షం కారణంగా రోడ్లు జలమయమై పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యంగా ఐటీ కారిడార్ ప్రాంతమైన గచ్చిబౌలి, మాదాపూర్, మియాపూర్‌లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో స్థానికులు అసౌకర్యానికి గురయ్యారు.
అర్ధరాత్రి 12 గంటల తర్వాత కూడా నగరంలోని మరిన్ని ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.