మెగాస్టార్ చిరంజీవి, ఈ రోజు సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన జూబ్లీహిల్స్‌లోని అధికారిక నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశం సుమారు రాత్రి 8 గంటల సమయంలో జరిగింది.
సడెన్ గా జరిగిన ఈ భేటీపై రాజకీయ వర్గాల్లోనూ, టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ వివిధ ఊహాగానాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ సమావేశం టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఏదైనా కీలక విషయంపై జరిగినదా? లేక పూర్తిగా మర్యాదపూర్వక భేటీ మాత్రమేనా? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం ఈ సడెన్ మీటింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, వీరి సమావేశం వెనక అసలు కారణం ఏమై ఉండొచ్చోనన్న చర్చ కూడా ఊపందుకుంది.