HYD | స్కూటీని ఢీకొట్టి.. కిలోమీటర్ ఈడ్చుకెళ్లి..

HYD | స్కూటీని ఢీకొట్టి.. కిలోమీటర్ ఈడ్చుకెళ్లి..
HYD | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మాదాపూర్ పరిధిలో శనివారం రాత్రి డీసీఎం బీభత్సం సృష్టించింది. మైండ్ స్పేస్ వద్ద ఇద్దరు దంపతులు వెళ్తున్న స్కూటీని ఢీకొట్టింది. అయినా డీసీఎం డ్రైవర్ ప్రమాదాన్ని గమనించకుండా స్కూటీని కిలోమీటర్ మేర ఈడ్చుకెళ్లాడు. కొంతదూరం వెళ్లాక స్కూటీ పైనుంచి భర్త పక్కకు పడిపోవడంతో గాయాలయ్యాయి. స్కూటీపై ఉన్న భార్యను డీసీఎం డ్రైవర్ కిలోమీటర్ మేర ఈడ్చుకెళ్లాడు. దీంతో ఆమె అక్కడే మృతి చెందింది. స్థానికులు గమనించి ఆపడంతో వాహనాన్ని వదిలి డ్రైవర్ పరారయ్యారు. క్లీనర్‌కు దొరకడంతో స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఇద్దరు దంపతులు మలబార్ బంగారం దుకాణంలో పనిచేస్తున్నారు. కూకట్‌పల్లిలో సినిమా చూసి మహేశ్వరం తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది
