HYD | కుమార్తె, ప్రియుడు అరెస్ట్

HYD | కుమార్తె, ప్రియుడు అరెస్ట్
HYD | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సంచలన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. ప్రేమ వ్యవహారానికి అడ్డుగా నిలిచిందన్న కారణంతో ఓ మహిళను ఆమె స్వంత కుమార్తె ప్రియుడి సహాయంతో హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
కౌకూర్ భరత్‌నగర్‌కు చెందిన అంజు అనే మహిళ 10 నెలల క్రితం అదృశ్యమైన విషయం తెలిసిందే. ఈ కేసును విచారించిన పోలీసులు, అనుమానాస్పద పరిస్థితుల్లో విచారణ జరిపి అసలు నిజాన్ని బయటపెట్టారు. దర్యాప్తులో భాగంగా అంజు చిన్న కుమార్తె ఇషిక, ఆమె ప్రియుడు మౌంటీరాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో, తల్లి తమ సహజీవనానికి వ్యతిరేకంగా ఉండటంతో ఆమెను హత్య చేసి ఇంట్లోనే పూడ్చిపెట్టినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు సమాచారం. అంజు పేరుతో ఉన్న బైక్‌ను అమ్మేందుకు ప్రయత్నించడంతో ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమై, చివరకు నిజం బయటపడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలించారు.
