HYD | గవర్నర్‌ను కలిసిన బీఆర్ఎస్ ప్రతినిధులు

HYD | గవర్నర్‌ను కలిసిన బీఆర్ఎస్ ప్రతినిధులు

అక్రమ మైనింగ్‌పై కేటీఆర్ ఆరోపణలు

HYD | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లో గవర్నర్‌ను బీఆర్ఎస్ శాసనసభ పక్షం నేతలు కలిసి రాష్ట్రంలో జరుగుతున్న అవకతవకలపై ఫిర్యాదు చేశారు. అనంతరం కేటీఆర్ ప్రభుత్వం‌పై తీవ్ర ఆరోపణలు చేశారు.

హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో గవర్నర్‌ను బీఆర్ఎస్ శాసనసభ పక్షం సభ్యులు కలిసి పలు అంశాలపై ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా రాఘవ కన్‌స్ట్రక్షన్ సంస్థకు సంబంధించిన అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్రంలో అరాచక పరిపాలన కొనసాగుతోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజా సంపదను దోచుకుంటున్నారని విమర్శించారు. నిబంధనలను పక్కనపెట్టి అక్రమ మైనింగ్ నిర్వహిస్తూ వందల కోట్ల విలువైన వనరులను వినియోగిస్తున్నారని తెలిపారు.

ఈ అంశంపై తమ పార్టీ తరఫున ఇప్పటికే అసెంబ్లీలో ప్రస్తావించామని, అయినప్పటికీ ప్రభుత్వం సరైన స్పందన ఇవ్వలేదని కేటీఆర్ అన్నారు. అక్రమ మైనింగ్‌పై సీబీసీఐడీ విచారణ చేపడతామని ప్రభుత్వం చెబుతుండగా, తాము హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసినట్లు వెల్లడించారు.

హౌస్ కమిటీలకు ప్రాధాన్యం లేదని మంత్రి చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తప్పుబట్టారు. పార్లమెంట్ స్థాయిలో కూడా హౌస్ కమిటీలను కోరిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తూ, ఇక్కడ వాటిని నిర్లక్ష్యం చేయడం సరైంది కాదని ప్రశ్నించారు.

Leave a Reply