క్రీడాకారిణికి అభినంద‌న‌

రాష్ట్ర వాలీబాల్ పోటీలకు హుస్నాబాద్ విద్యార్థిని సింధు ప్రియ ఎంపిక
జిల్లా గ్రంథాలయ సంస్థ‌ చైర్మన్ కేడం లింగమూర్తి హర్షం


హుస్నాబాద్, ఆంధ్రప్రభ : సిద్ధిపేట (Siddipet) జిల్లా హుస్నాబాద్‌కు చెందిన విద్యార్థిని కె.సింధుప్రియ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైంది. గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఇటీవల నిర్వహించిన 69వ ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి వాలీబాల్ (17 సం.ల) పోటీల్లో సిద్ధిపేట జిల్లాకు ప్రాతినిధ్యం వహించిన సింధు ప్రియ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జట్టుకు బంగారు పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించింది.

ఈ నెల 18 నుంచి 20 వరకు మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా తిమ్మాపూర్ జిల్లా పరిషత్ హైస్కూల్‌లో జరగనున్న 69వ రాష్ట్ర పాఠశాలల వాలీబాల్ పోటీలకు ఆమె ఎంపిక అయినట్లు పాఠశాల పీడీ ఎస్.శౌరీలు, పీఈటీ శ్రీలత తెలిపారు. సింధు ప్రియ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడంపై జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి (Kedam Lingamurthy) హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ ప్ర‌తిభ చూపి మెర‌వాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. హుస్నాబాద్ ఎంఈఓ బండారి మనీల, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. విజయ, ఉపాధ్యాయ బృందం సింధు ప్రియను అభినందించారు.

Leave a Reply