judgment | భార్యను చంపిన భర్తకు జీవిత ఖైదు

-జిల్లా ఎస్పీ ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి
judgment | శ్రీకాకుళం(లీగల్), ఆంధ్రప్రభ : భార్యను హత్య చేసిన కేసులో ముద్దాయి జీరు వెంకట రమణకి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ శ్రీకాకుళం మొదటవ అదనపు న్యాయస్థానం జడ్జి పి.భాస్కరరావు గురువారం తీర్పు చెప్పారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ముద్దాయి జీరు వెంకట రమణ ఆయన భార్య జీరు రమణమ్మ వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నదన్న అనుమానంతో 2018 మార్చి 14వ తేదీన సాయంత్రం 5.30 గంటలకు బాణం గ్రామంలోని ఇంటి వద్ద హత్యకు పాల్పడ్డాడు. అప్పటి సీఐ, జేఆర్‌పురం సీఐ వై. రామకృష్ణ కేసు దర్యాప్తు చేసి కోర్టుకు ఛార్జీ షీట్ దాఖలు చేశారు. నేరం నిరూపితం కావడంతో ముద్దాయి వెంకటరమణ కు జీవితకాల జైలు శిక్ష, రెండు వేల రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
