Inhuman incident | భర్త మోసం చేశాడని…

Inhuman incident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సంగారెడ్డి జిల్లాలో అమానుష ఘటన వెలుగుచూసింది. మోసం చేసిన వ్యక్తి స్థానంలో అతని భార్యను చెట్టుకు కట్టేసి అవమానించడం తీవ్ర చర్చకు దారితీసింది.

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని దామరగిద్ద గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రభాకర్ అనే వ్యక్తి హెచ్‌బీఎం ఫైనాన్స్ పేరుతో పలువురి నుంచి డబ్బులు తీసుకుని పరారైనట్లు సమాచారం. దీంతో నష్టపోయిన బాధితులు ఆగ్రహంతో అతని భార్య, అంగన్‌వాడీ టీచర్ వసంతకుమారిని లక్ష్యంగా చేసుకున్నారు.

బాధితులు ఆమెను చెట్టుకు కట్టేసి అవమానించగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న గ్రామ పెద్దలు వెంటనే జోక్యం చేసుకుని ఆమెను విడుదల చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అనంతరం వసంతకుమారి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భర్త చేసిన తప్పుకు భార్యను శిక్షించడం సరికాదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply