పుణ్య నదులను, నదీ సంగమాలను నదీ తల్లిగా, పుణ్యదేవతగా భావించి ఆరాధించడం భారతీయుల సాంప్రదాయం. ఆరాధన అంటే పసుపు, కుంకుమ, పుష్పాలు, ధూపం, దీపం నైవేద్యం, హారతులతో చేయాలి. నదీ తల్లికి పెట్టిన నైవేద్యాన్ని చాలా మంది తెలియక నదిలో వస్తారు. కానీ భగవంతునికి నివేదన చేసినపుడు ప్రసాదాన్ని దేవుడికి చూపినట్లుగా పుణ్య నదులకు చూపి దానిని ప్రసాదంగా మనం స్వీకరించాలి.
నది ఆరాధనలో భాగంగా దక్షిణ నదిలో వేయరాదు. పూణ చేస్తున్నప్పుడు దక్షిణను భగవంతుని పేర పూజారులకు ఇస్తాము లేదా హుండీలో వేస్తాము. నదీ ఆరాధనలో కూడా ప్రసాదాన్ని భక్తులకి, దక్షిణ బ్రాహ్మణులకి ఇవ్వాలి తప్ప నదిలో నాణేలు వెయరాదు. బంగారం, వెండి కూడా నదుల్లో వేస్తారు. నదిని ఉద్దేశించి అన్ని దానాలు బ్రాహ్మణుడికి చేయాలి లేదా నది దగ్గర హుండీ ఉంటే దానిలో వేయాలి ఆ సొమ్ము నదిని నిర్వహించడానికి అనగా యాత్రికులకు సౌకర్యం కల్పించడం వంటి వాటికి ఉపయోగపడుతుంది.