మానవుని చూపు నాగుపాము విషముకంటే, అగ్ని జ్వాలలకంటే, పిశాచాలకంటే ప్రమాదకరమని అంటారు. ఇతరులు చూస్తుండగా భోజనం కూడా చేయరాదు. శాస్త్ర ప్రకారం భార్య, భర్తలు కూడా ఒకరు చూస్తుండగా ఒకరు భోజనం చేయరాదు. చూస్తే తప్పేంటని భావించరాదు. పసిపిల్లలకు కూడా బయటివారు చూస్తుండగా భోజనం పెట్టరాదు. తిన్న వెంటనే పసివాడు వాంతులతో బాధపడితే కారణం దృష్టి దోషమే. దృష్టి, స్పర్శ ఈ రెండు ఆ వ్యక్తుల స్వభావాన్ని బట్టి ప్రభావాన్ని కలిగిస్తాయి. ఎవరు ఎటువంటి వారో తెలియదు కావున ఎవరూ చూడకుండా, తాకకుండా శుచిగా, రుచిగా ఏకాంతంగా భుజించడం సనాతన సంప్రదాయం నేటి జనజాతరలో నియమాలు పాటించడం కుదరదు కావున మనం భుజించేటపుడు మొదట ఒక ముద్ద తీసి దృష్టి దోష నివారణకు పక్కన పెట్టి తరువాత భుజించాలి. దీనిని భూతబలి, దృష్టి బలి అని అంటారు.
దృష్టి దోష పరిహారం ఎలా చేయాలి?
