సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక్కరోజు ఆదాయం ఎంతంటే..

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక్కరోజు ఆదాయం ఎంతంటే..

మోపిదేవి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయంగా విరాజుల్లుతున్న మోపిదేవిలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయానికి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. స్వామివారికి ఆదివారం ఒక్కరోజే 8.56 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు సోమవారం తెలిపారు. భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని.. ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ఆలయ సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఆయన వివరించారు.

Leave a Reply