ఒకే వ్య‌క్తికి రెండు చోట్ల ఎలా కేటాయిస్తారు?

ఒకే వ్య‌క్తికి రెండు చోట్ల ఎలా కేటాయిస్తారు?

మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కాశవారి గూడెంకి చెందిన మహమ్మద్ పక్కీర్(Mohammed Pakkir) అహమ్మద్ గత 30 సంవత్సరాల క్రితం ప్రభుత్వ భూమిలో నివాసం ఉండేందుకు సర్వెనెంబర్ 402 లో 242 గజాల భూమిలో గుడిసె వేసుకొని నివాసం ఉంటుండగా, గత 10 సంవత్సరాల క్రితం దశలవారీగా తన ఇంటి నిర్మాణం చేపట్టాన్నారు.

2020లో ఆ స్థలం తనదేనని అడ్డగూడూర్ మండలం కోటమర్తికి చెందిన బెల్లి నగేష్(Belli Nagesh) తనకు ప్రభుత్వం క్రీడాకారుల కోటాలో కాశవారి గూడెంలో సర్వే నెంబర్ 402లో 242 గజాల భూమిని కేటాయిచార‌న్నారు. ఇది తనదేనని, ఇట్టి స్థలాన్ని కాళీచేయాలని తహసీల్దార్ ను సంప్రదించగా ఈ రోజు తహశీల్దార్ అనుమతులతో తన ఇంటిని మున్సిపాలిటీ అధికారులు జేసిబి సహాయంతో నేల‌ మట్టం చేసారని తమకు న్యాయం చేయాల‌న్నారు.

లేని పక్షంలో తనకు చావే శరణ్యమని(Chave Sharanyamani) రోదిస్తూ బాధిత కుటుంబం పెట్రోల్ డబ్బతో రోడ్డుపై బైటాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సర్ది చెప్పడంతో రాస్తారోకో విరమించారు. ఈ సందర్భంగా భాదితులు మాట్లాడుతూ.. సదరు బెల్లె నగేష్ క్రీడాకారుల కోటాలో మోత్కూరు కాశవారి గూడెంలోనే కాకుండా భువనగిరి పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో సైతం డబల్ బెడ్ రూం ప్రభుత్వం సమకూర్చందని, ఒకే వ్యక్తికి రెండు చోట్ల ప్రభుత్వం(Government) ఎలా కెటాయిస్తారని, అతనికి భువనగిరిలో డబల్ బెడ్ రూం ఇచ్చి మోత్కూరు కాశవారి గూడెంలోని స్థలంను తమకు ఇప్పించాలని కోరుతున్నారు.

Leave a Reply