తాంసి, ఏప్రిల్ 17 (ఆంధ్రప్రభ ): మండలంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఓ ఇల్లు దగ్ధమైంది. గురువారం మండలంలోని జామిడి గ్రామానికి చెందిన దేవమ్మ అనే ఒంటరి మహిళకు చెందిన ఇంటిలో ప్రమాదవశాత్తు పూజ గదిలో దీపంతో మంటలు విస్తరించి ఇల్లు దగ్దమైంది. వెంటనే స్థానికులు మంటలు అదుపు చేశారు. ఇంట్లో రూ.20వేల నగదుతో పాటు నిత్యావసర సరుకులు మొత్తం కాలిపోయాయి. బాధిత మహిళ ఆ సమయంలో ఇంట్లో లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఆదుకోవాలని బాధిత మహిళ కోరుతున్నారు.
ADB | అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం
