షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం..

కోటపెల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అన్నారం గ్రామంలో మంగళవారం ప్రమాదవశాత్తు విధ్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించి తెప్పల సమ్మిరెడ్డికి చెందిన ఇల్లు పూర్తిగా దగ్ధమైనది. ప్రమాదంపై సమాచారం అందుకున్న కోటపల్లి ఎస్ఐ రాజశేఖర్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఎస్ఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం ఇంట్లో దూరికే శారదా భర్త పోచన్న, అంజలి భర్త సమ్మయ్య, అను రెండు కుటుంబాలు అద్దెకు ఉంటున్నారని, వీరు కూలిపనికి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు, ఈ ప్రమాదంలో సుమారు 6లక్షల రూపాయల మేర ఆస్థి నష్టం ఉంటుందని అన్నారు,
