house | ఇందిరమ్మ గృహా నిర్మాణానికి భూమి పూజ చేసిన సర్పంచ్

house | ఇందిరమ్మ గృహా నిర్మాణానికి భూమి పూజ చేసిన సర్పంచ్
house | జుక్కల్, ఆంధ్రప్రభః జుక్కల్ మండలంలోని పెద్ద ఎడ్గి గ్రామానికి చెందిన లబ్ధిదారులైన కాసులవార్ గంగాబాయి,సుంకర్ వార్ వీరమణికి ఇందిరమ్మ గృహలు మంజూరు కావడంతో అధికారులు మార్క్ఔట్ వేయగా గ్రామ సర్పంచ్ ఆస్పత్వర్ అనిల్ కుమార్,ఎంపీడీఓ బి.శ్రీనివాస్ ఇంద్రరమ్మ గృహ నిర్మాణానికి భూమిపూజ చేశారు. గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంద్రరమ్మ గృహలు మంజూరు కావటం జరుగుతుందని, మంజూరైన లబ్ధిదారులు త్వరతిగతిన ఇంటి నిర్మాణం చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి రమేష్ చారి,వార్డు సభ్యులు శంకర్ తో పాటు గ్రామపెద్దలు సంతోష్, మొగులాజి,పండరి,రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
