ఇస్లామాబాద్ : నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం. కశ్మీర్ నదుల్లో హిందువుల రక్తం పారిస్తాం. యుద్ధం మొదలు పెడతాం. మీ అంతు చూస్తాం” అంటూ వరల్డ్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన సభలో అతడు ఈ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఐతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చాలా ఏళ్ల కాలం నాటిదని అధికారులు ధ్రువీకరించారు.
జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. 26 మంది అమాయక టూరిస్టుల్ని లష్కరే తోయిబా అనుబంధ ఉగ్ర సంస్థ టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఘటనపై యావత్ భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటోంది. ఈ మేరకు ఇప్పటికే భారత్ ”సింధు జలాల ఒప్పందాన్ని” రద్దు చేసింది. పాక్ జాతీయులకు వీసాలను రద్దు చేసింది, అట్టారీ-వాఘా బోర్డర్‌ని క్లోజ్ చేసింది. రెండు దేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్న తరుణంలో, ఈ ఉగ్రవాది పాత వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.