Hospital | ఉచిత ఆర్థోపెడిక్ ఆరోగ్య శిబిరం

Hospital | ఉచిత ఆర్థోపెడిక్ ఆరోగ్య శిబిరం

  • డా.సతీష్ కుమార్ నేతృత్వంలో వైద్య సేవలు సూచనలు

Hospital | హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ : హుజూర్‌నగర్ పట్టణంలోని గాంధీ హాస్పటల్ లో మెడికవర్ హాస్పిటల్ సికింద్రాబాద్ సహాకారంతో ఎముకలు, కీళ్ల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ప్రజలకు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఉచిత ఆర్థోపెడిక్ ఆరోగ్య శిబిరం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఐ చరమందరాజు హాజరై వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. మెడికవర్ హాస్పిటల్‌కు చెందిన సీనియర్ ఆర్థోపెడిక్ వైద్యుడు డా. సతీష్ కుమార్ గారి నేతృత్వంలో ఆర్థోపెడిక్ వైద్య బృందం పాల్గొని మోకాలి నొప్పులు, వెన్నునొప్పి, కీళ్ల నొప్పులు, ఆస్టియోఆర్థ్రైటిస్, గాయాలు తదితర సమస్యలకు సంబంధించి సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించారు.

Hospital

ఈ శిబిరంకు హాజరైన రోగులకు ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి అవసరమైన చికిత్సలు జీవనశైలి మార్పులపై సూచనలు అందించారు. ఎముకలు కీళ్ల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశలోనే వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా దీర్ఘకాలిక నొప్పులు శస్త్రచికిత్స అవసరాన్ని గణనీయంగా తగ్గించవచ్చని డా.సతీష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ మెడికవర్ హాస్పిటల్ వారి ఫ్యామిలీ కార్డులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మోహన్ బాబు, గాంధీ హాస్పిటల్ మేనేజ్మెంట్ వల్లపుదాసు కృష్ణ, అబ్బిమల్ల కోటి, ఎస్కే సైదా, జనార్దన్ హాస్పిటల్ వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply