Hospital 14th | గర్భిణీ మృతి

Hospital 14th | గర్భిణీ మృతి
Hospital 14th | నరసరావుపేట, ఆంధ్రప్రభ : నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాల(hospital)లోని ప్రసూతి విభాగంలో ఓ మహిళ మృతి చెందింది. రెంటచింతల మండలం పాల్వాయి గేటు గ్రామానికి చెందిన సాగరమ్మ (21) కాన్పు కోసం నరసరావుపేట పాత ప్రభుత్వ వైద్య శాలలో చేరింది. ఆమెకు బుధవారం ఉదయం ఆపరేషన్ చేశారు. అనంతరం కొద్ది సేపటికి ఆమె మృతి చెందింది. వైద్యలు నిర్లక్ష్యంతోనే సాగరమ్మ మృతి చెందిందని బంధువులు ఆరోపించారు.
పల్నాడు జిల్లా నరసరావుపేట ఏరియా ఆసుపత్రిలో వైద్యం వికటించి మహిళ మృతి చెందింది. కాన్పు కోసం ఈనెల 14న(14th) మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన సాగరమ్మ బ్లడ్ తక్కువగా ఉందని నరసరావుపేటకి వెళ్లాలని డాక్టర్లు సూచించారు. అదే రోజు కాన్పు కోసం నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో సాగరమ్మ చేరింది. ఆపరేషన్(operation) చేసి మగ బిడ్డను బయటకు తీసారు.
అయితే.. ఆపరేషన్ చేసిన కొద్ది సేపటికే స్పృహ తప్పి పడిపోయింది. పరీక్షించగా అప్పటికే మృతి చెందినది అని డాక్టర్లు ధ్రువీకరించారు. మృతురాలు స్వగ్రామం దుర్గి మండలం శ్యామరాజపురంగా గుర్తించారు. అయితే.. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందిందని మృతురాలి బంధువుల ఆరోపిస్తున్నారు.
