Hospital | ఎయిడ్స్‌పై అవగాహనే ప్రధాన ఆయుధం

Hospital | ఎయిడ్స్‌పై అవగాహనే ప్రధాన ఆయుధం

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

Hospital | నందిగామ, ఆంధ్రప్రభ : నందిగామ పట్టణంలోని డీవీఆర్ ఏరియా హాస్పిటల్‌లో సోమవారం ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే (MLA) తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఆసుపత్రి ప్రాంగణం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన వీధుల గుండా సాగింది. ఇందులో వైద్య సిబ్బంది, నర్సులు, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన పెంపొందించడం, అపోహలను తొలగించడం, సురక్షితమైన జీవనశైలి పాటించాల్సిన అవసరాన్ని ప్రజలకు తెలియజేసే నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎయిడ్స్ (AIDS) వ్యాధిపై భయం కంటే, అవగాహన ఎంతో ముఖ్యం. సరైన సమాచారంతోనే ఈ వ్యాధిని నియంత్రించవచ్చు. ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని అన్నారు. ప్రభుత్వం వైద్య రంగానికి, ముఖ్యంగా వ్యాధుల నియంత్రణకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో హాస్పిటల్ కమిటీ చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు, డాక్టర్లు, పరిపాలనా సిబ్బంది, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

Leave a Reply