ఆరోగ్యకర జీవనానికి హోమియోపతి మార్గం

ఆరోగ్యకర జీవనానికి హోమియోపతి మార్గం

  • ఆయుష్ సేవల్లో హోమియోపతి కీలక పాత్ర
  • వ్యాధి నివారణలో హోమియోపతి ప్రాధాన్యం,
  • నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ ; ఆరోగ్య నాగర్ కర్నూల్ గా మార్చే లక్ష్యంతో, ఆయుష్ సేవలు, యోగాను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ హెల్త్ వీక్ లో భాగంగా 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలోభాగంగా ఆరోగ్య థీమ్ – డే 5 సందర్భంగా శుక్రవారం “ప్రపంచ హోమియోపతి దినోత్సవం & ఆయుష్ దినోత్సవం” వేడుకలు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా నిర్వహించారు.

ప్రపంచ హోమియోపతి ( ఆయుష్ డే ) దినోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ముఖ్యఅతిథిగా హాజరయ్యా డిఎంహెచ్ఓ డాక్టర్ రవి కుమార్,తో కలిసి హాజరై కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాదావత్ సంతోష్, మాట్లాడుతూ.. యోగ సాధన ద్వారా శారీరక మరియు మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం హోమియోపతి, యోగా, ఆయుర్వేద వంటి సంప్రదాయ వైద్య విధానాలను మరింత ప్రోత్సహిస్తూ అందుబాటులోకి తీసుకువస్తోందన్నారు.

హోమియోపతి వైద్యం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం అత్యంత అవసరం. ఇది సహజసిద్ధమైన మరియు సురక్షితమైన చికిత్సా విధానంగా గుర్తింపు పొందింది. “సిమిలియా సిమిలిబస్ కురెంటూర్” (సదృశం సదృశంతోనే నయం అవుతుంది) అనే సిద్ధాంతంపై ఆధారపడిన హోమియోపతి, శరీరంలోని సహజ రోగనిరోధక శక్తిని పెంపొందించి వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుంది. హోమియోపతి వైద్యం ప్రత్యేకత, ఇది వ్యాధి లక్షణాలను మాత్రమే కాదు, రోగి యొక్క శారీరక, మానసిక స్థితులను కూడా పరిగణనలోకి తీసుకుని చికిత్స అందిస్తుంది.

దీని వల్ల దీర్ఘకాలిక వ్యాధులు, అలర్జీలు, చర్మ సమస్యలు, జీర్ణ సంబంధ సమస్యలు వంటి అనేక సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఆరోగ్య సంరక్షణలో హోమియోపతి ప్రాముఖ్యత రోజురోజుకీ పెరుగుతోంది. దుష్ప్రభావాలు తక్కువగా ఉండటం, తక్కువ ఖర్చుతో చికిత్స అందుబాటులో ఉండటం, అన్ని వయసుల వారికి అనుకూలంగా ఉండటం దీని ప్రధాన ప్రయోజనాలు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ సేవలను విస్తరించి ప్రతి ఒక్కరికీ చేరువ చేయడంపై దృష్టి సారించామని పేర్కొన్నారు. వెల్నెస్ సెంటర్లు మరియు ప్రత్యేక వైద్య శిబిరాల ద్వారా ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆయుష్ జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ గోపాల్ నాయక్, డిఎంహెచ్ఓ డాక్టర్ రవి నాయక్, ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ ఉషారాణి, వివిధ విభాగాల వైద్యులు, రోగులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply