Homeguard | పాత్ర కీలకం..

Homeguard | పాత్ర కీలకం..
Homeguard, ఏలూరు, ఆంధ్ర ప్రభ బ్యూరో : ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని పెరేడ్ గ్రౌండ్ లో హోంగార్డుల డ్రిల్ ను అదనపు ఎస్పీ జి. ముని రాజా, హోం గార్డ్స్ డీఎస్పీ కిరణ్ కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు ఇరువురు హోంగార్డ్ లతో మాట్లాడుతూ… ప్రజలతో మర్యాదగా మెలగాలని హితవు పలికారు. ఏలూరు జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో హోం గార్డుల వారాంతపు డ్రిల్, శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ఏఆర్ అదనపు ఎస్పీ జి. ముని రాజా, హోం గార్డ్ డిఎస్పీ కిరణ్ కుమార్ సందర్శించి, వారి పని తీరును పరీక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీతో పాటు హోం గార్డ్ బీఎస్పీ కిరణ్ కుమార్, ఆర్.ఐ పవన్ కుమార్ పాల్గొని, హోం గార్డుల క్రమశిక్షణ, డ్రిల్ నైపుణ్యాలను పరిశీలించారు.
డ్రిల్ అనంతరం అదనపు ఎస్పీ జి.ముని రాజా హోం గార్డులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. పలు కీలక సూచనలు చేశారు.”హోం గార్డులు విధి నిర్వహణలో ప్రజలతో ఎంతో మర్యాద పూర్వకంగా, సహనంతో వ్యవహరించాలి. పోలీసు శాఖకు, ప్రజలకు మధ్య వారధిలా ఉంటూ, బాధితులకు మెరుగైన సేవలు అందించడంలో ప్రాధాన్యత ఇవ్వాలి” అని సూచించారు. హోం గార్డ్స్ పోలీస్ వ్యవస్థలో భాగస్వామ్యం. పోలీస్ వ్యవస్థలో హోం గార్డుల పాత్ర చాలా కీలకమైనదని, శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు వంటి అన్ని రకాల విధుల్లో పోలీసులతో సమానంగా, చురుగ్గా పాలుపంచుకోవాలని కోరారు. క్రమశిక్షణే ముఖ్యం.. యూనిఫామ్ ధరించిన ప్రతి ఒక్కరూ క్రమశిక్షణను పాటించాలని, వృత్తి పట్ల గౌరవంతో బాధ్యతలను నిర్వర్తించాలని స్పష్టం చేశారు. పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచేలా హోం గార్డులు పని చేయాలని, నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజల భద్రతకు తోడ్పడాలని అధికారులు ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో హోంగార్డ్ ఆర్ఎస్ఐ భాస్కరరావు, హోంగార్డ్స్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.


