సొంతిల్లు కల నెరవేర్చిన ప్రభుత్వం…

సొంతిల్లు కల నెరవేర్చిన ప్రభుత్వం…

  • లబ్ధిదారులకు ఇళ్లు అందించి ఆనందం నింపిన ప్రభుత్వం
  • కోమటిగూడెంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం
  • రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన సర్పంచ్ పనికర సోమయ్య
  • ఎమ్మెల్యే కడియం శ్రీహరికి లబ్ధిదారుల కృతజ్ఞతలు

స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల గృహ స్వప్నాలు నిజమవుతున్నాయి. అర్హులైన లబ్ధిదా రులకు సొంతిల్లు కల్పిస్తూ వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోంద ని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని కోమటిగూడెం గ్రామంలో ఇదునూరి రజిత రాజు, మాసంపల్లి వీరస్వామి అనే లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి కావడంతో మంగళవారం ఘనంగా గృహప్రవేశ కార్యక్ర మం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ పనికర సోమ య్య ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశాలను ప్రారం భించి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యురాలు ఇదునూరి అమల, పంచాయతీ సెక్రటరీలు సంతోష్ నాయ క్, మహేందర్, కారోబార్ నాగరాజు, కార్యకర్తలు, తదితరులు పాల్గొ న్నారు.

-అభివృద్ధి ప్రధాత మా కడియం సార్: (కోమటిగూడెం సర్పంచ్ పనికర సోమయ్య)

కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోంది. ప్రతి అర్హుడికి సొంతిల్లు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇల్లు లేని వారికి గృహం కల్పించడం ఎంతో గొప్ప విషయం. ఎమ్మెల్యే సహకారంతో గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకాల లబ్ధి అందేలా కృషి చేస్తాను. గ్రామ అభివృద్ధి కోసం ఎల్ల ప్పుడూ కట్టుబడి పనిచేస్తాను. అనంతరం మా గ్రామంలోని పేద ప్రజల పట్ల, అభివృద్ధి విషయంలో ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి సార్ ప్రత్యేక కృతజ్ఞతలు..

-మా కడియం సార్‌కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం: (ఇదునూరి రజిత, లబ్ధిదారులు)

ఇల్లు నిర్మించుకోలేక స్థోమత లేక ఎన్నో రోజులుగా పాడుబడిన ఇంట్లో నే ఉంటూ ఇబ్బందులు పడుతూ జీవించాం. కానీ మా ఎమ్మెల్యే సార్ సహకారంతో సొంతింటి కల నెరవేరింది. గ్రామ సర్పంచ్ పర్యవేక్షణ వల్లే ఈ ఇంటి పనులు సజావుగా పూర్తయ్యాయి. ప్రభుత్వం ఇచ్చిన ఇందిర మ్మ ఇల్లు నాకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు గృహప్ర వేశం కూడా చేసాం. మా ఎమ్మెల్యే కడియం సార్‌కు కుటుంబ సభ్యులం దరం ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం.

-ఎమ్మెల్యే కడియం సార్‌కు కృతజ్ఞతలు: (మాసంపల్లి వీరస్వామి, లబ్ధిదారులు)…

ఇన్నేళ్లుగా సొంతిల్లు కోసం ఎదురుచూస్తున్న మా కుటుంబానికి ఈ రోజు గృహ స్వప్నం నెరవేరడం ఎంతో ఆనందంగా ఉంది. అలాగే గ్రామ సర్పంచ్ పర్యవేక్షణ వల్లే ఈ పనులు సజావుగా పూర్తయ్యాయి. మాలాంటి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు పథకం గొప్ప వరం లాంటిది. అసలు ఉండడానికి ఇల్లు లేని వారికి ప్రభుత్వం చేపట్టిన ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది. నాకు ఇందిరమ్మ ఇల్లును అందించిన ప్రభుత్వం, మా ఎమ్మెల్యే కడియం సార్‌కు మా కుటుంబం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు.

Leave a Reply