హోంగార్డు మృతి
రామన్నపేట, అక్టోబర్ 9 (ఆంధ్రప్రభ ) : కంటైనర్ లారీ (Container lorry) ఢీకొట్టడంతో హోంగార్డు మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలోని స్థానిక సుభాష్ సెంటర్లో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన కూరెళ్ల ఉపేంద్ర చారి (36) (Upendra Chari) రామన్నపేట పోలీస్ స్టేషన్ లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు.
డ్యూటీలో భాగంగా తెల్లవారుజామున వెహికల్ చెకింగ్ (Vehicle Checking) చేస్తుండటంతో భువనగిరి నుండి చిట్యాల వైపు వెళ్తున్న లారీ కంటైనర్ డ్రైవర్ అతివేగంతో.. అజాగ్రత్తగా అతనిపైకి దూసుకెళ్లడంతో తల చితికిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. అతనికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీసులు సంఘటన స్థలం వద్ద పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రామన్నపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు.