home l కుటుంబ గొడవలతో ఇంటి నుండి వెళ్లి పోయిన గాలిమరల కంపెనీ ఉద్యోగి..

home l కుటుంబ గొడవలతో ఇంటి నుండి వెళ్లి పోయిన గాలిమరల కంపెనీ ఉద్యోగి..

ఒక రోజు వ్యవధిలోనే ట్రేస్ చేసి అప్పగించిన ఉరవకొండ పోలీసులు

home l అనంతపురం: ఆంధ్రప్రభ: పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన నరసింహరాజు ఉరవకొండ ప్రాంతంలోని గాలిమరల కంపెనీలో పని చేస్తున్నారు. ఇతనికి, భార్య బంధువుల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. తనను ఇబ్బంది పెడుతున్నారని కలత చెంది ఇంటి నుండీ చెప్పాపెట్టకుండా వెళ్లిపోయాడు. వెళ్తూ తన బాధను వెల్లగక్కుతూ సెల్ఫీ వీడియో తీసి వైరల్ చేశాడు. ఈ వీడియో ఆధారంగా కొందరు పనిగట్టుకుని మసాలా యాడ్ చేసి దీనిపై పోలీసులు చర్యలు తీసుకోలేదని వాట్సాప్ గ్రూపుల్లో దుష్ప్రచారం చేశారు.

వాస్తవానికి నరసింహరాజు సోదరుడు నిన్న మధ్యహ్నాంపైన ఉరవకొండ పోలీసులను ఆశ్రయించి విషయాన్ని మౌఖికంగా వివరించాడు. ఉరవకొండ ఎస్సై జనార్ధన్ నాయుడు ఆధ్వర్యంలో పోలీసులు ఉరవకొండ, గుంతకల్లు ప్రాంతాలలో వెదికారు. సాంకేతికతను వినియోగించారు. నరసింహరాజు ఆచూకీ కనుగొని ఎస్సై ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఇష్టానుసారం వైరల్ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు

Leave a Reply