ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాలేశ్వరం త్రివేణి సంగమం వద్ద జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హాజరుకానున్నారు. సాయంత్రం 4:30 గంటలకు కాలేశ్వరం చేరుకొనున్నారు. 4:40 గంటలకు సరస్వతి ఘాట్ వద్ద అంతర్వాహినిలో పుష్కర స్నానం ఆచరించి శ్రీ కాలేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు.
రాత్రి 7 గంటలకు జ్ఞాన సరస్వతి ఘాట్ వద్ద నిర్వహించే నవరత్న హారతి కార్యక్రమంలో పాల్గొని అనంతరం అక్కడనుండి తిరుగు పయనం కానున్నారు.