ప్రధాని పర్యటన నేపథ్యంలో సర్కార్ నిర్ణయం
కర్నూలు జిల్లాలో రెండు రోజులు మూతబడనున్న ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు
15, 16 తేదీల్లో విద్యాసంస్థలు తెరిస్తే చర్యలుంటాయని అధికారుల హెచ్చరికలు
నంద్యాల బ్యూరో, అక్టోబర్ 15 ఆంధ్రప్రభ : కర్నూలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు రోజుల పాటు విద్యా సంస్థలు మూతబడనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) కర్నూలు జిల్లా పర్యటన నేపథ్యంలో 15,16 తేదీల్లో ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలువులు ప్రకటించిందని పేర్కొంటూ ఆర్ఐఓ, జిల్ల విద్యాశాఖ అధికారులు వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు.
పదో తరగతి విద్యార్థులకు ప్రస్తుతం ఎఫ్ ఏ-2 పరీక్షలు జరుగుతున్నందున వాటీ తేదీల్లో మార్పులు చేసుకుని 17,18వ తేదీన నిర్వహించుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యా సంస్థలు పనిచేయాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి మండల, డివిజన్ స్థాయి అధికారులు ప్రభుత్వ ఆదేశాలు అమలు అయ్యేలా పర్యవేక్షించాలని సూచించారు.