Schools | నెల్లూరు జిల్లాలో బడులకు సెలవు

జేసీ వెంకటేశ్వర్లు ప్రకటన
Schools | ( నెల్లూరు, ఆంధ్రప్రభ ప్రతినిధి) : దిత్వా తుఫాను కారణంగా జిల్లాలో విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున డిసెంబర్ 1న (సోమవారం) అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, అంగన్వాడీ పాఠశాలలు, అలాగే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, జానియర్ కళాశాలలకు సెలవు ప్రకటించినట్లు జేసి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉత్తర్వులను అన్ని రకాల పాఠశాలలు, జానియర్ కళాశాలల యాజమాన్యాలు విధిగా అమలుచేయాలని జేసి ఆదేశించారు.
