స్టేషన్ ఘన్‌పూర్‌లో హోలీ ఆనంద కేళి!

స్టేషన్ ఘన్‌పూర్‌లో హోలీ ఆనంద కేళి!
- ఉత్సాహ ఉల్లాసాలతో హోలీ సంబరాలు
- చిన్నా పెద్దా తేడా లేకుండా ఘనంగా రంగుల పండుగ
- గ్రామాల వారీగా సంప్రదాయ పద్ధతిలో కామదహనం
- పోలీసుల బందోబస్తులో ప్రశాంతంగా హోలీ వేడుకలు
స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో రంగుల హరివిల్లు విరిసింది. వసం త ఋతువు ఆహ్లాదాన్ని, సఖ్యతా సందేశాన్ని మోసుకొచ్చే హోలీ పండుగను ప్రజలు ఉత్సాహ ఉల్లాసాల మధ్య ఘనంగా ఆచరించారు. చెడుపై మంచి విజయం సాధించాలనే సంకల్పంతో జరుపుకునే ఈ పర్వదినం సామరస్యానికి, సోదరభావానికి ప్రతీకగా నిలిచింది.
మంగ ళవారం స్టేషన్ ఘన్‌పూర్ మండల పరిధిలో హోలీ పండుగ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో అంగరంగ వైభవంగా జరిగాయి. పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో చిన్నా, పెద్దా తారతమ్యాలు లేకుండా ప్రజలు ఒకరిపై ఒకరు వివిధ రంగులు చల్లుకుంటూ హోలీ సంబరాలను ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరుపుకున్నారు.
కాలనీలు, ప్రధాన వీధులు రంగుల హరివిల్లుగా మారాయి. చిన్నా రులు, యువకులు, మహిళలందరూ సందడి చేస్తూ నృత్యాలు చేసి హోలీ శుభాకాంక్షలు పరస్పరం తెలియజేసుకున్నారు. రాజకీయ పార్టీ లకు అతీతంగా ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు హోలీ వేడుకల్లో పాల్గొని ప్రజలతో కలిసిమెలిసి సంబరాల్లో మునిగిపోయారు.
-గ్రామాల్లో సంప్రదాయ పద్ధతిలో కామదహనం:
హోలీ ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి కామదహనం కార్యక్రమాన్ని గ్రామాల వారీగా ఘనంగా నిర్వహించారు. యువకులు, బాలబాలి కలు ప్రధాన చౌరస్తాలు, బొడ్రాయి ప్రాంతాల్లో సంప్రదాయ పద్ధతిలో కామదహనం నిర్వహించి చెడుపై మంచి విజయం సాధించాలనే సంకల్పంతో ప్రార్థనలు చేశారు. మంగళవారం ఉదయం నుంచి యువత ఇంటింటికీ వెళ్లి రంగులు చల్లి హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ సఖ్యతా సందేశాన్ని వ్యాప్తి చేశారు.
అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతుల తో జీవించాలని కోరుకుంటూ హోలీ పండుగను సోదరభావంతో జరు పుకున్నారు. హోలీ వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సీఐ వేణు పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ప్రజలు కూడా పోలీసుల సూచనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో పండు గను విజయవంతం చేశారు.
