Hockey | విద్యార్థులు అభినందనలు..

Hockey | విద్యార్థులు అభినందనలు..
Hockey, గూడూరు, ఆంధ్రప్రభ : నెల్లూరు (Nellore) పట్టణంలోని ఏ.సి సుబ్బారెడ్డి స్టేడియంలో నవంబర్ 7వ తేదీ జరిగిన జిల్లా స్థాయి హాకీ ఎంపికల్లో లిటిల్ ఏంజెల్ పబ్లిక్ స్కూల్ నుండి బి.నోవక్ ఆకాష్, యు.లితేష్, కే.సూర్య తేజ, భువనేష్ మీనాలు పాల్గొన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచి ఎంపిక కావడం సంతోషదాయకమని పాఠశాల కరస్పాండెంట్ బుస్సా రెడ్డి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. బుధవారం గూడూరు పట్టణ శారదానగర్లోని లిటిల్ ఏంజెల్స్ పాఠశాలలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను ఆయన అభినందించారు.
ఎంపికైన విద్యార్థులు ఈ నెల 22, 23, 24 తేదీలలో తిరుపతి (Tirupati) జిల్లా, చంద్రగిరిలో జరగనున్న రాష్ట్ర స్థాయి ఎస్జీ ఫై అండర్ -14 బాలుర కేటగిరి హాకీలో ఆడనున్నారు. అనంతరం పీఈటీ మాస్టర్ వి.కృష్ణయ్య, విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందనలు తెలియజేశారు. తమ పాఠశాలలో చదువులకు ఎంత ప్రాధాన్యత ఇస్తామో అంతే ప్రాధాన్యత క్రీడలకు కూడా ఇవ్వడం జరుగుతుందని.. తద్వారా తమ పాఠశాల తరఫున పోటీలలో పాల్గొనే ఏ విద్యార్థి అయినా ప్రతిభ చూపడం తమకెంతో సంతోషదాయకమని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
