హమ్మయ్య…. దొరికిండు
- పోలీసుల అదుపులో ఫేక్ ట్రక్ షీట్ల వ్యవహారంలో ప్రధాన నిందితుడు
- నెల రోజులకు పట్టుకున్న పోలీసులు
- శాయంపేట నవంబరు (ఆంధ్రప్రభ): రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడిన ప్రధాన నిందితుడు బెజ్జంకి శ్రీనివాస్ ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం శాయంపేట, కాట్రపల్లి గ్రామాలలో ఐకేపీ అధ్వర్యంలో గత రబీ సీజన్లో నిర్వహించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రూ.186 కోట్లు అ క్రమాలు జరిగినట్టు అధికారుల విచారణలో వెల్లడైంది. దీనిపై అక్టోబరు 11న శాయంపేట పోలీస్ స్టేషన్లో ఫేక్ ట్రక్ షీట్ల వ్యవహారంలో 21 మందిపై 61(2), 318(4), 336(3), 338, 316(5), 314, 217, r/w 3(5)BNS, 66C, 66D, 65ITA Act- 2008 సెక్షన్ల కింద నాన్బేయిల్బుల్ కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న సాంబశివ రైస్ మిల్లర్ బెజ్జంకి శ్రీనివాస్ తన కుటుంబ సభ్యులతో సహా గత నెల రోజులుగా పరారీలో ఉన్నాడు. ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తులు చేసుకుంటున్నా లభించలేదు. దీంతో పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. నెల రోజులుగా పోలీసులు రాష్ట్రాలు పట్టుకొని తిరిగిండ్లు. అయినప్పటికీ నెల రోజుల పాటు పోలీసులకు దొరక్కుండా పారిపోయారు. ఈ క్రమంలో పక్కా సమాచారం తో ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో ఉన్నట్లు సమాచారం అందుకున్న తెలుసుకున్న 8 మంది కుటుంబ సభ్యులతో సహా శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకొన్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో నిందితులు ఉన్నట్లు తెలిసింది. అయితే ఏసీపీ అందుబాటులో లేకపోవడంతో అరెస్టు చూపించేందుకు పోలీసులు కొంచెం సమయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఏసీపీ రాగానే వారిని కోర్టులో హాజరు పరచనున్నట్లు ఓ పోలీస్ అధికారి తెలిపారు.
