భార్య గొంతు కోసి…
నాగోల్, ఆంధ్రప్రభ : పెళ్లైన ఏడాదికే.. భార్య గొంతు కోసి ఆత్మహత్య చేసుకున్నభర్త సంఘటన హైదరాబాద్ సిటీ(Hyderabad City) పరిధి నాగోలు లో ఈ రోజు జరిగింది. బాధితురాలికి తీవ్రగాయాలు కావడంతో నాగోల్ లోని సుప్రజ ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. పోలీసులు(Police) తెలిపిన వివరాల ప్రకారం నాగోల్ డివిజన్ పరిధి లక్ష్మీనరసింహ కాలనీ పేస్-2 రోడ్డు నెంబర్ -10 కు చెందిన వేణుగోపాలకు మహాలక్ష్మితో గత సంవత్సరం వివాహం జరిగింది.
పెళ్లైన నెల రోజుల నుంచే అదనపు కట్నం కోసం వేణుగోపాల్ (Venugopal)మహాలక్ష్మిని వేధించేవాడు. చిత్రహింసలు కూడా పెట్టడంతో భరించలేక పుట్టింటికి వెళ్లిపోయింది. అతని వ్యవహారం గురించి పెద్దలకు చెప్పగా వారంతా పంచాయితీ చేసి సర్దిచెప్పారు.
కొద్దిరోజులు(Few Days) సజావుగానే ఉన్నా.. మళ్లీ అదనపుకట్నం కోసం వేధించసాగాడు. చివరికి కట్నం కోసం గొడవ పెరిగి పెద్దది కావడంతో ఆమె గొంతుకోశాడు. అనంతరం ఆయన కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
మహాలక్ష్మి అరుపులు విన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చి, బాధితురాలిని(Victim) సుప్రజ ఆస్పత్రికి తరలించారు. ఆమె సర్జరీ కూడా చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేసినట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.