CHEQUE| పెడన, ఆంధ్రప్రభ : నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో పెడన నియోజకవర్గ పరిధిలో ‘ముఖ్యమంత్రి సహాయ నిధి’ నుంచి వైద్య ఖర్చుల కోసం 33 మంది లబ్దిదారులను ఎంపిక చేశారు. ఈ లబ్దిదారులకు రూ.19,22,828 లు విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ… అనారోగ్యానికి గురైన వారు ఆర్థిక పరిస్థితులతో ఇబ్బంది పడకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వారికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా నిలబడుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి సహయనిధి పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని, ఇంటి పెద్ద కొడుకుగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ కొనియాడారు.
CHEQUE| పేదలకు అండగా..

