పెట్రోల్ బంకులో హైటెన్షన్

హైదరాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : పంజాగుట్ట (Panjagutta)లోని ఎర్రమంజిల్‌లో ఓ పెట్రోల్ బంకులో సోమ‌వారం ( అక్టోబ‌రు 6న‌) కారులు మంటలు చెలరేగాయి. దీంతో అక్క‌డున్న‌వారంతా భ‌య‌భ్రాంతుల‌కు గుర‌య్యారు. వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పేశారు. దీంతో పెట్రోల్ బంకుకు ప్రమాదం తప్పటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటన సమయంలో కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మంటలను చూసి వాహనదారులు దూరంగా పరిగెత్తారు. మంటలను ఆర్పిన వెంటనే కార్ ను పెట్రోల్ బంక్ నుండి బయటికి తీసుకెళ్లారు.

Leave a Reply