High school | ఐపీఎస్ ఆదేశాల మేరకు…

High school | ఐపీఎస్ ఆదేశాల మేరకు…

High school | గుడివాడ–ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు, గుడివాడ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ వి. ధీరజ్ వినీల్ ఆధ్వర్యంలో, గుడివాడ రూరల్ సీఐ ఎస్.ఎల్.ఆర్. సోమేశ్వరరావు పర్యవేక్షణలో బిల్లపాడు హై స్కూల్ నందు విద్యార్థిని–విద్యార్థులకు గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సై ఎన్. చంటి బాబు మరియు పోలీస్ సిబ్బంది వారు సైబర్ క్రైమ్, బాల్యవివాహాల నివారణ, రోడ్డు భద్రత, శక్తి టీం తదితర అంశాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు ఆన్‌లైన్ మోసాలు, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాల్యవివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలు, రోడ్డు ప్రమాదాల నివారణ పై అవగాహన కల్పించారు. సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే పోలీసులను లేదా శక్తి టీంను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిల్లపాడు హైస్కూల్ హెచ్ఎం బొబ్బిలి. సూర్య నాగేశ్వరరావు, గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు మహిళా పోలీసులు పాల్గొన్నారు.

Leave a Reply