హైదరాబాద్ : కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిపై హెచ్సీయూ, తెలంగాణ సర్కార్ కు మధ్య వివాదం తారా స్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవలే కంచ గచ్చిబౌలి భూములను టీజీఐఐసీకి కేటాయింపు, టీజీఐఐసీకి కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
అదేవిధంగా ఆ భూములను జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని కోరుతూ.. వట ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థతో పాటు మరో ముగ్గురు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఇవాళ ఆ పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి కేసు సుప్రీంకోర్టులో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయా పిటిషన్లపై విచారణను వేసవి సెలవుల తర్వాత వరకు వాయిదా వేస్తున్నట్లుగా న్యాయమూర్తి పేర్కొన్నారు.