సుబ్రహ్మణ్యేశ్వరుడిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

మోపిదేవి, ఆంధ్రప్రభ : మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాల కృష్ణారావు దంపత సమేతంగా దర్శించుకున్నారు. దేవస్థానానికి వచ్చిన న్యాయమూర్తి దంపతులను ఆలయ కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ వేద పండితులు ఘన స్వాగతం పలికారు. జస్టిస్ గోపాల కృష్ణారావు దంపతులు ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో పాలు పోసి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం న్యాయమూర్తి దంపతులు శ్రీ స్వామి వారిని దర్శించుకొనగా, ఆలయ వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరిని ఆలయ కార్య నిర్వహణాధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు జ్ఞప్తికగా శ్రీ స్వామివారి చిత్రపటాన్ని అందజేసి, ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు.

Leave a Reply