High Court | ఇమ్మడి రవి త్వరలో…

High Court | ఇమ్మడి రవి త్వరలో…

  • ఏపీ హైకోర్టు న్యాయవాది పెటేటి రాజారావు

High Court | ఖైరతాబాద్, ఆంధ్రప్రభ : మూవీ పైరసీ కేసులో అరెస్టైన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి(Immadi Ravi)ని త్వరలో నిర్దోషిగా బయటకు వస్తారని ఏపీ హైకోర్టు(AP High Court) న్యాయవాది పెటేటి రాజారావు ప్రకటించారు. ఈ మేరకు బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…ఇమ్మడి రవి కేసు విషయంలో చట్టపరంగా బలమైన వాదనలు వినిపించి, త్వరలోనే బెయిల్‌(Bail)పై విడుదలయ్యేలా చర్యలు తీసుకుంటానని రాజారావు తెలిపారు.

పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు బెయిలబుల్ సెక్షన్లు కావడంతో బెయిల్ పొందడం సులభమని పేర్కొన్నారు. త్వరలో రవి తండ్రిని కలసి ధైర్యాన్ని అందిస్తామని తెలిపారు. రవి చేసింది తప్పే అయినప్పటికీ తెలుగు ప్రజల మద్దతు అతనికి ఉందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసారు. ప్రజల పక్షాన నిలబడి, న్యాయస్థానంలో న్యాయాన్ని గెలిపించేందుకు కృషి చేస్తానని పెటేటి రాజారావు(Peteti Raja Rao) స్పష్టం చేశారు.

Leave a Reply