న్యాయవాది కుటుంబ సభ్యుల సేవలు ఆదర్శం…

న్యాయవాది కుటుంబ సభ్యుల సేవలు ఆదర్శం…

బిక్కనూర్, ఆంధ్రప్రభ : హైకోర్టు ప్రముఖ న్యాయవాది పెద్ద బచ్చ గారి రామ్ రెడ్డి కుటుంబ సభ్యులు అందించిన సేవలు ఎంతో ఆదర్శమని సిద్ధిరామేశ్వర ఆలయ కమిటీ అధ్యక్షుడు లింబాద్రి అన్నారు. ఐదు రోజుల పాటు స్వామి వారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఇందులో భాగంగా న్యాయవాది రామ్ రెడ్డి కుటుంబ సభ్యులు ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారని తెలిపారు.

అంతేకాకుండా స్వామి వారి కళ్యాణాన్ని పురస్కరించుకొని పట్టు వస్త్రాలు సమర్పించినట్లు చెప్పారు. స్వామివారి ఆశీస్సులు వారి కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం రామ్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆలయ కమిటీ తరఫున సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ పీఠాధిపతి సదాశివ మహంతు, ఆలయ కార్యనిర్వాక అధికారి శ్రీధర్, ఆలయ పాలకవర్గ సభ్యులు పూజారులు భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply