Hero Yash | 100 రోజుల్లో యష్ టాక్సిక్..

Hero Yash | 100 రోజుల్లో యష్ టాక్సిక్..
Hero Yash | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : కేజీఎఫ్ హీరో యష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టాక్సిక్. గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే.. ఈ క్రేజీ మూవీ రిలీజ్‌కు కౌంట్ డౌన్(Count down) స్టార్ట్ అయ్యింది. 2026లో మార్చి 19న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. అంటే.. ఈ సినిమా రిలీజ్‌కు వంద రోజులు మాత్రమే మాత్రమే ఉంది. వచ్చే సంవత్సరం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చేస్తోన్న సినిమాల్లో టాక్సిక్ ఒకటి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్(Updates)తో మూవీ పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.
సినిమా పై ఉన్న ఎక్స్పెక్టేషన్స్(Expectations)ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లేలా చిత్ర యూనిట్ టాక్సిక్ నుంచి ఓ సరికొత్త, పవర్ ఫుల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. యష్ ఇందులో రగ్డ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. తన శరీరం పై ఉన్న టాటూస్ చూస్తుంటే.. తనలోని బ్యాడ్ క్యారెక్టర్(Bad character)ను పోస్టర్‌తో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లుంది. ఈ పోస్టర్ పై అభిమానులు, ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాను మంచి పండుగ సీజన్లో రిలీజ్ చేస్తున్నారు. గుడి పడ్వ, ఉగాది, ఈద్ కలిసిన వీకెండ్ కావడంతో బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ వసూలు చేయడానికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పచ్చు.
Hero Yash | 100 రోజుల్లో యష్ టాక్సిక్..

టాక్సిక్ సినిమాకు సంబంధించిన సరికొత్త పోస్టర్(Brand new poster)తో పాటు సినిమా అద్భుతంగా రావటంలో తమదైన పాత్రను పోషిస్తోన్న టెక్నీషియన్స్ వివరాలను కూడా చిత్ర యూనిట్ ప్రకటించింది. జాతీయ అవార్డు గ్రహీత రాజీవ్ రవి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, సంగీతాన్ని రవి బస్రూర్ అందిస్తున్నారు. యష్, గీతూ మోహన్ దాస్ రాసిన ఈ కథను గీతూ మోహన్ దాస్ డైరెక్టర్ చేస్తున్నారు. ఇంగ్లీష్, కన్నడలో షూటింగ్ చేస్తోన్న ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, మలయాళం సహా ఇతర భాషల్లో(In other languages) డబ్ చేసి రిలీజ్ చేయనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ క్రియేషన్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కేజీఎఫ్ తర్వాత యష్ నుంచి వస్తున్న మూవీ కావడంతో ఎక్స్ పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. మరి.. యష్ అంచనాలను ఎంత వరకు అందుకుంటాడో చూడాలి.
