సాయం చేసే చేతులు కావాలి…

సాయం చేసే చేతులు కావాలి…
వెంకటాపుర్, ఆంధ్రప్రభ : కొన్నిసార్లు దేవుడు పరీక్ష పెట్టడానికి పేదలే దొరుకుతుంటారు. జ్వరం వచ్చినా వేలాది రూపాయలు వైద్యానికే ఖర్చు చేస్తున్న రోజులివి. ఇక పెద్ద ఆరోగ్య సమస్య వస్తే వైద్యా(Vaidya)నికి లక్షల్లోనే ఖర్చు చేయకతప్పదు. పేదవాడికి అండగ ఆరోగ్యశ్రీ(Arogyashri) ఉంటుందనుకుంటే పొసిజర్స్ కు వర్తించదు.
రెక్కాడితే డొక్కాడని ఆ నిరుపేద కుటుంబంలో పసిబాలుడికి అనారోగ్య సమస్య వచ్చింది. వైద్యులను చూపించారు. వైద్యానికి లక్షల్లో ఖర్చు అవుతుంది. బాబును బతికించుకునేందుకు ఆ బీద కుటుంబం ఉన్న కాస్తా భూమి(Bhumi)ని సైతం అమ్ముకున్నారు. అయినా ఇంకా ఆరోగ్య సమస్య తీరలేదు. ఆ బాబును బతికించుకోవాలంటే లక్షలాది రూపాయలు ఖర్చు చేయాలి. కానీ వాళ్ల దగ్గర అంత డబ్బులు లేవు. బాబు బతకాలంటే సాయం చేసే చేతులు కావాలి.
ములుగు జిల్లా వెంకటాపూర్(Venkatapur) మండలం వెళ్తుర్లపల్లి గ్రామానికి చెందిన ఆత్మకూరు క్రాంతి అఖిల దంపతులకు ఏడాదిన్నరు బాబు రిత్విక్. బుడిబుడి అడుగులు వేసే రిత్విక్ ఈ నెల 1న అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు. వైద్యులను సంప్రదించగ న్యూమోనియా (ఊపిరితిత్తుల) వ్యాధి సోకినట్లు నిర్ధారించారు. దీనితో రిత్విక్(Ritwik) హన్మకొండలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.
ఆసుపత్రిలో ఇప్పటివరకు రూ.మూడు లక్షల పైగా ఖర్చు కాగా ఇంటి స్థలం గుంటన్న స్థలం అమ్మి వైద్యం చేయిస్తున్నారు. అయితే ఆస్పత్రిలో రోజు సుమారు రూ. 25 వేల వరకు ఖర్చు వస్తుండటంతో ఆపన్న హస్తం(Apanna Hastam) కోసం ఎదురు చూస్తున్నారు. తమ కుమారుడి ప్రాణం కాపాడేందుకు దాతలు ముందుకు వచ్చి సెల్ : 7093602897 సంప్రదించి ఆదుకోవాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.



