ట్రాఫిక్ సీఐ మన్సురుద్దీన్
HELMET | కర్నూల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : జిల్లాలో ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ సీఐ మన్సురుద్దీన్ అన్నారు. శుక్రవారం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహనదారులకు రోజా పువ్వు ఇచ్చి అభినందించారు. ప్రమాదాల నివారణకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు కర్నూలు ట్రాఫిక్ సీఐ తెలిపారు. రాజ్ విహార్, సి.క్యాంపు పలు చోట్ల వాహనాల తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాటికి జరిమానాలు విధించారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వ్యక్తులను ఆపి, అరగంటపాటు సమయం ఇచ్చి హెల్మెట్ లు తెచ్చుకున్న తర్వాత రోజా పువ్వు ఇచ్చి పంపించారు. హెల్మెట్ ధరించని 50 మంది లో ఒక్కొక్కరి పై రూ. 1035 జరిమనాలు విధించారు. అతి వేగం, తలకు హెల్మెట్ ధరించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్ తెలిపారు.

