Helium | ఇరాన్ దాడుల ప్రభావం: ఎంఆర్‌ఐ ఖర్చులు పెరుగుదల?

Helium | ఇరాన్ దాడుల ప్రభావం: ఎంఆర్‌ఐ ఖర్చులు పెరుగుదల?

Helium | ఇరాన్ దాడులు – ఖతర్‌పై ప్రభావం
హీలియం సరఫరా నిలిచిపోవడం వెనుక కారణాలు
ఎంఆర్‌ఐ స్కాన్లపై ప్రభావం ఏమిటి?
భారత్‌పై పడే ఆర్థిక భారం
వైద్య రంగంపై భవిష్యత్ ప్రభావాలు

Helium | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఇరాన్–ఇజ్రాయెల్, అమెరికా ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికాకు మద్దతుగా నిలిచిన దేశాలపై ఇరాన్ విరుచుకుపడింది. ఈ సమయంలో ఖతర్‌పైన కూడా ఇరాన్ దాడి చేసింది. ఈ దాడిలో ఖతర్‌లోని ఇంధన స్టేషన్లు నేలమట్టం అయ్యాయి. అక్కడి నుంచి చమురుతో పాటు హీలియం సరఫరా కూడా ఆగిపోయింది. అయితే హీలియం వల్ల కలిగే నష్టం ఏమిటని ఆలోచిస్తున్నారా? హీలియం లేకపోతే ఎంఆర్‌ఐ స్కాన్ యంత్రాలు పనిచేయవంట..

Helium

యుద్ధం ఇప్పుడు ఆరోగ్యరంగంపైన కూడా ప్రభావం చూపుతోంది. ఏదైనా వ్యాధితో బాధపడేవారికి సమస్య బయటపడకపోతే, ఎంఆర్‌ఐ స్కాన్ ద్వారా గుర్తిస్తారు. అయితే ప్రస్తుతం యుద్ధ ప్రభావంతో వాటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు మూడింట ఒక వంతు హీలియం ఖతర్ నుంచే వస్తుంది. కానీ ఖతర్‌పై దాడి, అలాగే హార్మూజ్ జలసంధి మూసివేత కారణంగా హీలియం సరఫరా నిలిచిపోయింది.

Helium

హీలియం అనేది సాధారణ వాయువు మాత్రమే కాకుండా, ఆధునిక వైద్య సాంకేతికతలో కీలక పాత్ర పోషించే మూలకం. ముఖ్యంగా ఎంఆర్‌ఐ యంత్రాల్లో ఉన్న సూపర్‌కండక్టింగ్ మాగ్నెట్‌లను చల్లబరచేందుకు హీలియం చాలా అవసరం. ఇటువంటి సందర్భంలో హీలియం సరఫరా నిలిచిపోవడంతో భారత్‌లో ఎంఆర్‌ఐ ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం తక్షణ సంక్షోభం లేదని వైద్య నిపుణులు చెబుతున్నప్పటికీ, పరిస్థితి ఇలాగే కొనసాగితే స్కానింగ్ సేవలపై ఒత్తిడి పెరుగుతుంది. ధరలు పెరిగితే ఇది సాధారణ ప్రజలపై ఆర్థిక భారం పడే అవకాశం ఉంది.

Leave a Reply