Dharmayuddham| ధర్మయుద్ధ సభకు భారీ బందోబస్తు

  • ప్రధాన రోడ్ల వద్ద ప్రత్యేక చెక్‌పోస్ట్‌లతో పోలీసుల‌ పహారా
  • ఉట్నూర్ మార్కెట్ బంద్‌తో నిర్మానుషంగా రోడ్లు

Dharmayuddham | ఉట్నూర్, ఆంధ్రప్రభ : లంబాడీలను ఎస్టీ జాబితా తొలగించాలని ప్రధాన డిమాండ్‌తో అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పట్టణంలోని ఎంపీడీవో గ్రౌండ్ లో ఈరోజు నిర్వహించే ఆదివాసీల ధర్మయుద్ధ సభకు పోలీస్ భద్రత చర్యలు కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నారు. ఆదివాసుల ధర్మయుద్ధ ఆదివాసుల సభకు వేలాది మంది ఆదివాసి నాయకులు, ఆదివాసులు తరలివస్తున్నారని తెలియడంతో పోలీసులు రెండు రోజులుగా ముందస్తు చర్యలు చేపడుతున్నారు.

ఈరోజు జరిగే ధర్మయుద్ధ సభలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆదిలాబాద్ ఎస్పీ, ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, పోలీసులు కట్టుదిట్ట‌మైన చర్యలు చేపట్టారు. ఉదయం నుంచి పట్టణంలోని ప్రధాన వీధుల వద్ద పోలీసులు చెక్‌పోస్టు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆసిఫాబాద్, అదిలాబాద్, మంచిర్యాల‌ వైపు నుంచి ఉట్నూరుకు వచ్చే బస్సులను వాహనాలను వేరే రూట్లలో మళ్ళించారు. దీంతో ఉట్నూర్ బస్టాండ్ నిర్మానుషంగా మారింది. పోలీసులు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. అఖిల్ మహత్యం, అఖిల్ మహాజన్, ఏఎస్పీ కాజల్ సింగ్, పోలీసులు పెద్ద సంఖ్యలో భద్రతా పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు.

Leave a Reply