ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో…

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana) రాష్ట్రాల్లో వ‌ర్షాలు (Rains) కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంతో రెండు రోజుల పాటు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

తెలంగాణలో రెండు మూడు గంటలలో సంగారెడ్డి, కామారెడ్డి జిల్లా(Kamareddy District)లలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, జగిత్యాల, జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్, మెదక్, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్ జిల్లాలలో మోస్త‌రు వర్షం కురిసే అవకాశం ఉంది. కొమురం భీం, మంచిర్యాల, సూర్యాపేట, మహబూబాబాద్‌ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ (Hyderabad) జిల్లాలలో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని.. మిగతా అన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావ‌ర‌ణ శాఖ (Meteorological Department) ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడలో భారీ వర్షాలు కురుస్తాయి. ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో మోస్తరు-భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూగో, పగో, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి-మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Leave a Reply