భారీ వాన

  • జిల్లా ప్రజలు విలవిల


కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో : వరుణుడి ప్రతాపంతో కర్నూలు (Kurnool) జిల్లా విలవిలలాడుతోంది. శుక్రవారం తెల్లవారుజాము నుంచే జిల్లాలో వరుణుడి నాట్యం కొనసాగుతోంది. ముఖ్యంగా కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోని, గూడూరు, బెల్గల్ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వానలతో జనజీవనం కొంత మేరకి అస్తవ్యస్తమవుతోంది. ఈ వర్షాల కారణం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనమేనని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీని ప్రభావంతో శనివారం కూడా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

భారీ వర్షాల (Heavy rains) నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు చెట్ల కింద, శిథిల భవనాలు, హోర్డింగ్స్ దగ్గర ఉండకూడదని హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు దాటి ప్రయాణించరాదని సూచించారు. జిల్లాలో సహాయ చర్యలకు అధికారులు సిద్ధంగా ఉన్నారని సమాచారం. ప్రజలు అత్యవసర సమయంలో స్థానిక అధికారులను సంప్రదించాలంటూ సూచిస్తున్నారు.

Leave a Reply